థర్డ్ సీక్వెల్ కి రెడీ అవుతున్న బాలీవుడ్ సినిమా..?
టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లో అయిన రకరకాల ఆడియన్స్ ఉంటారు. బాలీవుడ్ లో అయితే హారర్ సినిమాలను ఎంజాయ్ చేసే వారి సంఖ్య ఎక్కువ. ఈ తరుణంలో ప్రేక్షకుల నాడి కనిపెట్టిన ప్రియదర్శన్ “భూల్ భూలయా” అనే సినిమా తెరకెక్కించారు. 2007లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ కి మంచి హారర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు.
అక్షయ్ కుమార్, విద్యా బాలన్ లీడ్ రోల్స్ లో నటించిన భూల్ భూలయా మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. 2007లో ఈ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా “భూల్ భూలయా 2” సినిమా తీశారు. 2022లో వచ్చిన ఈ సీక్వెల్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. భూల్ భూలయా 2 సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించగా కియరా అద్వాని, టబు నటించారు.
ఈ రెండు పార్ట్స్ కూడా సూపర్ హిట్ అవడంతో “భూల్ భూలయా 3” కి రెడీ అవుతున్నారట మేకర్స్. ఈ సినిమాకు ఒక అద్భుతమైన యూనిక్ స్టోరీ కుదిరిందని అన్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. సెకండ్ పార్ట్ లో లాగానే భూల్ భూలయా 3లో కూడా కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తాడని సమాచారం.
నిర్మాత భూషణ్ కుమార్ భూల్ భూలయా 3 సినిమాను ఈ ఏడాదే పూర్తి చేయాలని తొందరగా ఉన్నారట. ఇక ఈ సినిమాకు థర్డ్ సీక్వెల్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా సిద్ధం చేస్తున్నారు అని సినీ విశ్లేషకుల నుండి సమాచారం అందుతుంది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ గా ఉన్నాడు. మరి భూల్ భూలియా థర్డ్ మూవీ ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.













