సోలోగా వస్తున్న భోళా శంకర్
వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ లో మెహర్ రమేష్ తో తన తర్వాతి సినిమాను చేస్తున్నాడు. భోళా శంకర్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వగా, ఈ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ అనౌన్స చేశాకే అదే రోజున సిద్దు జొన్నలగడ్డ టిల్లూ స్క్వేర్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో పాటూ రణబీర్ కపూర్ యానిమల్ కూడా అదే రోజున రిలీజ్ అవనున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు.
కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ రెండు సినిమాలు పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు భోళా శంకర్ సోలో రిలీజ్ కానుంది. ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి. టీజర్ లా ఫ్యాన్స్ నే కాకుండా సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉంటే భోళా శంకర్ రూపంలో చిరూకు మరో హిట్ పడటం ఖాయం. మరి ఈ ఆగస్ట్ చిరూకి ఎలా కలిసొస్తుందో చూడాలి.













