‘భీమా’ ట్రైలర్ టాక్
హీరో గోపీచంద్ హిట్ అందుకుని చాలా కాలమే అయింది. సరైన సినిమా పడితే సక్సెస్ అదే వస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ లోటును భీమా సినిమా తీరుస్తుందని గోపీచంద్ అభిమానులు నమ్ముతున్నారు. హర్ష దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 8న శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే ఫాంటసీ టచ్ తో ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడో సుదూర తీరంలో ఉండే పరశురామ క్షేత్రంలో సాక్షాత్తూ పరమశివుడే కొలువుతీరి ఉన్నాడని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే అక్కడ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది అఘోరాలు సైతం అక్కడ దేవుని కృప కోసం ఎదురుచూస్తుంటారు.
అయితే కొందరు దుర్మార్గులు దాన్ని హస్తగతం చేసుకుని అరాచకాలకు నిలయంగా మార్చడంతో ఆ ఊరికి పోలీసాఫీసర్ గా వచ్చిన హీరో దాన్ని కట్టడి చేయాలని డిసైడవుతాడు. కానీ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండే ఆ ప్లేస్ లోకి పోలీసులా కాకుండా పరశురాముడిగా అడుగు పెడతాడు. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ ఏదో కొత్తగా ట్రై చేశాడని అనిపిస్తుంది. ట్రైలర్ లాగానే సినిమా కూడా ఉండే గోపీచంద్ ఖాతాలో హిట్టు పడ్డట్టే.













