Bheems: మూడు పాటలతోనే భీమ్స్ మ్యాజిక్
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకోవడం పెద్ద సవాల్ గా మారింది. ఇలాంటి టైమ్ లో భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారాడు. సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలో మూడు సాంగ్స్ ఇచ్చి అన్నింటినీ సూపర్ హిట్ చేశాడు. వాటిలో మొదటి సాంగ్ గోదారి గట్టు మీద(Godari Gattu Mida) పాటకు ఏకంగా ఫాస్టెస్ట్ 100 మిలియన్ క్లబ్ లో చేరింది.
ఆ సినిమాకు బీజీఎం పరంగా కూడా భీమ్స్ మంచి ప్రశంసలే అందుకున్నాడు. ఏదైనా సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ కొనేటప్పుడు ఆడియో కంపెనీలు ఎన్ని పాటలున్నాయనేది చూసుకుంటారు. దాన్ని బట్టే ఆ ఆల్బమ్ కు విలువ కడతారు. పాటలు ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని వ్యూస్ వచ్చే అవకాశముంటుంది కాబట్టి ఆ రూల్ పాటిస్తారు.
కానీ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన రూటే సపరేటంటూ కథ ఎంతవరకు డిమాండ్ చేస్తుందో అంతే చాలని మూడు పాటలతో సరిపెట్టాడు. ఉన్న ఆ మూడు పాటలను ది బెస్ట్ అయ్యేలా అవుట్పుట్ తీసుకున్నాడు. పాటలతోనే సినిమా సూపర్ హిట్ అనే టాక్ తెప్పించాడు భీమ్స్. తమన్(Thaman), దేవీ శ్రీ(Devi Sri Prasad) సరిగా మ్యాజిక్ చేయని టైమ్ లో భీమ్స్ ఇలా దూసుకెళ్లడం మంచి విషయమనే చెప్పాలి.













