‘భీమ్లా నాయక్’ తొమ్మిది రోజుల కలెక్షన్స్ ఇవే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఆయనకు పోటీగా డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఇద్దరూ పోటా పోటీగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్లో వసూళ్లను సాధిస్తుంది. తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సినిమా సాధించింది. సినిమా విడుదలై నేటికి పదవ రోజు. మరి 9 రోజుల్లో ‘భీమ్లా నాయక్’ సినిమాకు వచ్చిన వసూళ్ల వివరాలు ఏంటో చూద్దాం.
కోట్లలో…
నైజాం – 33.78
సీడెడ్ – 10.46
ఉత్తరాంధ్ర – 7.17
ఈస్ట్ – 5.18
వెస్ట్ – 4.75
గుంటూరు – 4.95 కృష్ణా – 3.52
నెల్లూరు – 2.40
టోటల్ గ్రాస్ చూస్తే.. రూ.109.95 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వచ్చిన షేర్ వసూళ్లు రూ. 72. 21 కోట్లు..
కర్ణాటక సహా రెస్టాఫ్ ఇండియాలో రూ.7.90 కోట్లు వచ్చాయి.
ఓవర్ సీస్లో వచ్చిన షేర్ వసూళ్లు రూ.11.85 కోట్లు
అంటే మొత్తం కలిపి రూ.91.96 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. గ్రాస్ ప్రకారం చూస్తే రూ.149.75 కోట్ల రూపాయలు వచ్చాయి. మరి ఈ నాలుగు రోజుల్లో ‘భీమ్లా నాయక్’ షేర్ కలెక్షన్స్ వంద కోట్ల రూపాయల మార్కును చేరుతుందా? అనేది చూడాలి. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలను అందించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.













