అమెరికాలో దూసుకుపోతున్న భరత్ అనే నేను
మహేష్ భరత్ అనే నేను సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో, ఓవర్సీస్లో కూడా అదే స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న అమెరికాలో భరత్ వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది. సినిమా విడుదలైన మొదటిరోజే రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 10 రోజుల్లో మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం 10 రోజుల్లో 3.19 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇది మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాస్ అని చెప్పొచ్చు.













