బాలీవుడ్ లో ‘భరత్ అనే నేను’ హీరో అక్షయ్ కుమార్ ?
ప్రపంచ వ్యాప్తంగా అలరించిన బాహుబలి చిత్రం తెలుగు వారి చిత్రం కావడం తో తెలుగు సినిమాలన్న తెలుగు సినిమా కథలన్నా బాలీవుడ్ వారికీ ఆకర్షణ ఏర్పడింది. ఈ నేపధ్యం లో తెలుగులో సుపర్ హిట్ అయినా సినిమాలు అవేరేజ్ గా రన్ అయినా సినిమాలను కూడా బాలీవుడ్ వర్గం వదిలిపెట్టడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై 2015లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. శృతిహాసన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు, హర్ష అనే క్యారెక్టర్ లో అద్భుతమైన నటనను కనబరిచారు. ఆ తరువాత మరొకసారి మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా భరత్ అనే నేను.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా పలు కమర్షియల్ హంగులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు.కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయి భారీ విజయాన్ని దక్కించుకుంది. సితార, ప్రకాష్ రాజ్, ఆమని, శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మహేష్, కియారా అద్వానీ ల జోడి ప్రేక్షకాభిమానులను ఎంతో అలరించింది. ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నారు అంటూ కొద్ది రోజులుగా పలు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని బాలీవుడ్ లో ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ కాంచన సినిమాను లక్ష్మి బాంబు గా రీమేక్ చేసాడు. ఇప్పటికే ‘భరత్ అనే నేను’ రీమేక్ విషయమై అన్నివిధాల సన్నద్ధమైన అక్షయ్ కుమార్ అతి త్వరలో దీనిని పట్టా లెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. ఎప్పుడూ కొంత విభిన్నమైన కథా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉండే అక్షయ్ కు ఈ సినిమా ఎంతో నచ్చిందని, ఒక ప్రముఖ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుండగా, హిందీలోని యువ దర్శకుడు ఒకరు దీనిని తీయనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.













