‘భరత్ అనే నేను’ ఫస్ట్ సాంగ్ విడుదల
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి లిరికల్ పాటను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ‘విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జన హితం భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను’ అంటూ నెమ్మదిగా సాగుతున్న ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా కైరా అడ్వాణీ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 20న ‘భరత్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.













