భైర ఆగమనానికి టైమొచ్చింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆయన లుక్ ను రిలీజ్ చేయగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సోలోగా తన స్టామినాని ప్రూవ్ చేసుకోనున్నాడు. దీనికి సైఫ్ సాయం కూడా తీసుకుంటున్నాడు. సినిమాపై హైప్ పెరగాలంటే దేవరలో ఉన్న ఆర్టిస్టులందర్నీ వాడుకోవాలి. ఇందులో భాగంగానే ఆగస్ట్ 15న సైఫ్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్ర ఇంట్రో గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ గ్లింప్స్ ద్వారా దేవరలో సైఫ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఆడియన్స్ కు తెలియనుంది. దేవరలో సైఫ్ భైర అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. దేవర పాత్రకు, అతని క్యారెక్టర్ కు ఓ ఎమోషనల్ కనెక్షన్ కూడా సినిమాలో ఉంటుందట. ఆచార్యకు జరిగిన పొరపాట్లు ఈ సినిమా విషయంలో రిపీట్ కాకుండా కొరటాల ఎంతో పకడ్భందీగా ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసుకున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













