భాగ్యశ్రీ సూపరంతే!
టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించిన హీరోయిన్లంతా వేరే భాష వాళ్లే. ఎన్నో ఏళ్లుగా నటిస్తున్నప్పటికీ ఎంతోమంది ఇప్పటికీ తెలుగు సరిగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులనే నమ్ముకుంటారు. వాయిస్ బాలేక డబ్బింగ్ చెప్పకపోతే బానే ఉంటుంది కానీ అసలు కనీసం ట్రై కూడా చేయకుండా ఉండటం చూస్తే సదరు హీరోయిన్ల కమిట్మెంట్ మీద డౌట్ వస్తోంది.
ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్ తను చేస్తున్న మొదటి సినిమాకే సొంత గొంతును వాడుకుంటోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న భాగ్యశ్రీ బోర్సే మొదటి సినిమాతోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే మిస్టర్ బచ్చన్ సాంగ్స్, ప్రోమోల్లో విపరీతంగా హైలైట్ అయిన భాగ్యశ్రీ, సినిమా రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ సంపాదించింది. దానికి తోడు ఆడియన్స్ మెప్పు పొందడానికి ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకుంటోంది. ఒకప్పటి హీరోయిన్లతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లు డబ్బింగ్ చెప్పాలని చూస్తున్నారు కానీ రెండు మూడు సినిమాల తర్వాత దాన్ని ట్రై చేస్తున్నారు. కానీ భాగ్యశ్రీ మాత్రం మొదటి సినిమాకే డబ్బింగ్ చెప్పడం తన డెడికేషన్ ను సూచిస్తుంది.













