Lenin: లెనిన్ లో లీలమ్మ ప్లేస్ లోకి ఆ బ్యూటీ?

ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలు పెట్టుకుని అఖిల్ అక్కినేని(Akhil Akkineni) చేసిన ఏజెంట్(Agent) సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ అవడంతో కాస్త గ్యాప్ తీసుకుని మరీ నెక్ట్స్ ఫిల్మ్ ను అనౌన్స్ చేశాడు అఖిల్. ప్రస్తుతం అఖిల్ మురళీ కృష్ణ అబ్బూరి(Murali krishna Abburi) దర్శకత్వంలో లెనిన్(lenin) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లెనిన్ మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది.
అనౌన్స్‌మెంట్ తోనే సినిమాపై అంచనాలను ఏర్పరచిన లెనిన్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. లెనిన్ లో అఖిల్ మాస్ లుక్ లో కనిపించడంతో పాటూ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడతాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల(Sree Leela) నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడీ మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నట్టు తెలుస్తోంది.
లెనిన్ నుంచి శ్రీలీల ఎందుకు తప్పుకుందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. డేట్స్ కారణంగానే అమ్మడు ఈ మూవీ నుంచి వాకౌట్ అయిందంటున్నారు. అయితే శ్రీలీల తప్పుకోవడంతో ఇప్పుడా ప్లేస్ లోకి మిస్టర్ బచ్చన్(Mr. Bachan) భామ భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse)ను లెనిన్ కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.