Bhagya Sri Borse: భాగ్యశ్రీ ఆశలన్నీ దానిపైనే!
రవితేజ(Ravi Teja) హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse). సినిమా రిలీజ్ కు ముందే అమ్మడు చాలా క్రేజ్ ను సంపాదించుకుంది. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొని డ్యాన్సులేసి ఎంతో హంగామా చేసింది. కానీ ఆ సినిమా ఫ్లాపవడంతో అమ్మడి కష్టమంతా బూడిదలో పోసినట్టైంది.
మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా భాగ్య శ్రీ బోర్సేకి తన అదృష్టం కొద్దీ అవకాశాలు బాగానే వచ్చాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు సినిమాలుండగా అందులో కింగ్డమ్(Kingdom) సినిమా జులై 31న రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతుంది.
దీంతో అమ్మడి ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఎలాగైనా కింగ్డమ్ తో హిట్ అందుకుని మంచి స్టార్డమ్ ను అందుకోవాలని భాగ్య శ్రీ ఆశ పడుతుంది. నిజంగానే కింగ్డమ్ హిట్టైతే అమ్మడికి అవకాశాలు క్యూ కట్టడం ఖాయం. ఈ సినిమాలో భాగ్యశ్రీ పాత్ర కూడా చాలా కీలకమని ఇప్పటికే హింట్స్ వచ్చాయి. అందుకే అమ్మడి పాత్రను మేకర్స్ పెద్దగా రివీల్ చేయలేదని అంటున్నారు. మరి ఈ సినిమా అయినా బచ్చన్ పాప ఆశల్ని తీరుస్తుందేమో చూడాలి.







