Bhagya Sri Borse: రామ్ సినిమాపైనే భాగ్యశ్రీ ఆశలన్నీ
ఇటీవల టాలీవుడ్ కు పరిచయమైన అందమైన హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే(bhagyasri borse) కూడా ఒకరు. రవితేజ(raviteja) హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్(mr.bachan) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మొదటి సినిమాతోనే తన అందం, నటన, డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకుంది. అయినా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ(vijay devarakonda)తో కింగ్డమ్(kingdom) చేస్తే అది కూడా ఫ్లాప్ గా నిలిచింది.
మొదటి రెండు సినిమాలూ వరుస ఫ్లాపులుగా నిలవడంతో భాగ్యశ్రీ తన తర్వాతి సినిమాలపై అంచనాలు పెట్టుకుంది. కింగ్డమ్ తర్వాత భాగ్యశ్రీ రెండు సినిమాలను లైన్ లో పెట్టగా, ఆ రెండు సినిమాలూ ఒకే నెలలో రెండు వారాల గ్యాప్ తో థియేటర్లలోకి రానున్నాయి. తాజాగా కాంత(kantha) సినిమా రిలీజవగా, ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra king thaluka) ఈ నెలాఖరుకి రిలీజ్ కానుంది.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన కాంత మూవీకి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కాంత బ్లాక్ బస్టర్ అవుతుందని భాగ్యశ్రీ పెట్టుకున్న ఆశలు ఈ సినిమాతో కూడా తీరేలా కనిపించడం లేదు. నటిగా కాంత మూవీతో భాగ్య శ్రీ కి మంచి పాత్రతో పాటూ ప్రశంసలు కూడా దక్కుతున్నాయి కానీ ఇంకా అమ్మడు సక్సెస్ టేస్ట్ మాత్రం చూడలేదు. దీంతో భాగ్యశ్రీ తన ఆశలన్నింటినీ తర్వాత రానున్న రామ్(Ram Pothineni) సినిమాపైనే పెట్టుకుంది. నవంబర్ 28న రిలీజ్ కానున్న ఆంధ్రా కింగ్ తాలూకా తనకు మంచి సక్సెస్ ను అందిస్తుందని అమ్మడు నమ్ముతోంది. మరి ఈ మూవీ అయినా తనకు సక్సెస్ ను దరి చేరుస్తుందేమో చూడాలి.






