Bhagavanth Kesari: విజయాన్ని ఆనందస్తున్న భగవంత్ కేసరి టీమ్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు రాణించాయి. ఎన్నో విభాగాల్లో అవార్డులను గెలుచుకుని తెలుగు చలన చిత్ర స్థాయిని తర్వాతి స్థాయికి తీసుకెళ్లాయి. కాగా ఉత్తమ తెలుగు చలన చిత్రంగా భగవంత్ కేసరి(bhagavanth kesari) ఎంపికైన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ హీరో.
కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్య(balayya) యాక్టింగ్, అనిల్(anil) డైరెక్షన్, తమన్(thaman) సంగీతం అన్నీ ఆడియన్స్ కు నచ్చాయి. పైగా సినిమాలోని మెసెజ్ కు ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే భగవంత్ కేసరిని నేషనల్ అవార్డు వరకు తీసుకెళ్లింది కూడా ఆ మెసెజే. బాక్సాఫీస్ వద్ మంచి కలెక్షన్లు అందుకున్న సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డును అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని చిత్ర యూనిట్ ఈ అవార్డుపై ఆనందాన్ని వ్యక్తం చేసింది.
అయితే భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో హీరో బాలకృష్ణ(balakrishna)తో పాటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi), సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీలీల(Sree Leela), నిర్మాత సాహు గారపాటి(sahu garapati) పాల్గొనగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.







