చెప్పిన టైమ్‌కు రానున్న బాలయ్య!
ఏపీలోని తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల భగవంత్ కేసరి వాయిదా పడొచ్చని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని యూనిట్ సభ్యులు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. కేవలం నాలుగైదు రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని, బాలయ్య కొంచెం టైమ్ కేటాయిస్తే సరిపోతుందంటున్నారు. బాలయ్య టైమ్ ఇవ్వడమే లేటు ఈ సినిమాను పూర్తి చేసేందుకు అనిల్ రావిపూడి ఇప్పటికే మొత్తం రెడీ చేసినట్లు చెప్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే రీరికార్డింగ్ మొదలుపెట్టాడని, ఆఖరి నిమిషం వరకు ప్రెజర్ లేకుండా తన వైపు ఎలాంటి లేట్ జరగకుండా పక్కా ప్లానింగ్‌తో టీమ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
రిలీజ్ కు ఇంకో నెల మాత్రమే టైమ్ ఉండటంతో ఇక నుంచి భగవంత్ కేసరి టీమ్ ప్రమోషన్స్ తో హడావిడి చేయాలి. కానీ పరిస్థితులు అలా లేవు. ఈ లోపు చంద్రబాబు బయటకు వస్తే ఆ ప్రమోషన్స్ కూడా బాగా జరిగే ఛాన్సుంది. అంతేకానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాను దసరా బరి నుంచి తప్పించడం జరగదని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్ని సమస్యలొచ్చినా చెప్పిన టైమ్‌కు భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం పక్కానట.













