ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ గ్యారెంటీ అంటున్న అనిల్
టాలీవుడ్ లో మాస్ అండ్ యాక్షన్ అంటే మొదటిగా గుర్తొచ్చే హీరో నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్షనిజం స్టోరీల నుంచి బోయపాటి సినిమాల వరకు ఎలాంటి స్టోరీలు చేయాలన్నా అది బాలయ్యకే చెల్లింది. బాలయ్య మాస్ ఇమేజ్ ఏంటన్నది ఆడియన్స్ కు ఐడియా ఉంది కాబట్టి బోయపాటి బాలయ్యతో మూడు సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టగలిగాడు.
బోయపాటి బాలయ్యను ఏ విధంగా అయితే వాడుకుని సినిమాలు చేశాడో, ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అదే లాజిక్ ను వాడుకుని బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేశాడు. భగవంత్ కేసరిలో బాలయ్య ఇమేజ్ ను ఏ మాత్రం తగ్గించకుండా అనీల్, కొత్త బాలయ్యను ప్రేక్షకులకు ప్రెజెంట్ చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
అంతే కాదు, భగవంత్ కేసరిలో బాలయ్యతో కొత్త ఆయుధాలు పట్టించినట్లు అనిల్ రివీల్ చేశాడు. కొత్త రకం ఆయుధాలతో బాలయ్య ఈ సినిమాలో దాడికి దిగుతాడని, ఆ యాక్షన్ సీన్స్ కు థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమని అనిల్ చెప్తున్నాడు. అంతేకాదు, తను బాలయ్యకు గొప్ప అభిమానినని, తన ఫ్యానిజాన్ని మొత్తం భగవంత్ కేసరిలో చూపించానని అనిల్ తెలిపాడు. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పిస్తుందో చూడాలి మరి.













