భగవంత్ కేసరిలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్
మరో రెండ్రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనున్న భగవంత్ కేసరి సినిమాపై ఫ్యాన్స్ కు ఎన్నో అంచనాలుండటంతో ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని టీమ్ మొత్తం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమాలో బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సీన్స్ కు ఎమోషనల్ అవడం ఖాయమని తెగ ప్రమోట్ చేస్తున్నారు.
మరోవైపు భగవంత్ కేసరిలో మీరు ఊహించని సర్ప్రైజ్లు చాలా ఉంటాయని అనిల్ రావిపూడి పదే పదే చెప్పడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలా గొప్పగా వచ్చాయట. అసలు బాలయ్య ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? సొంత కూతురు కాకపోయినా శ్రీలీలను ఎందుకంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో, శ్రీలీల క్యారెక్టర్‌ను, విలన్ క్యారెక్టర్ ను అనిల్ ముడి పెట్టిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుందని చెప్తున్నారు.
వీటన్నింటినీ బట్టి చూస్తుంటే భగవంత్ కేసరిలో ఊహించిన దానికంటే ఎక్కువే మ్యాటర్ ఉండనుందని తెలుస్తోంది. ట్రైలర్ చివరి షాట్ నా ఇష్టం వచ్చినట్టు పాడతా అనేది కూడా జైల్లో ఉన్నప్పుడే. వీటన్నింటిని బట్టి చూస్తే ఈ దసరాకు భగవంత్ కేసర మంచి ట్రీట్ ఇవ్వడం ఖాయంలానే ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.













