భగవంత్ కేసరికి పోటీగా నిలిచిన స్కంద
ఓటీటీలు వచ్చాక టీవీల్లో సినిమాలు చూడటం ప్రేక్షకులు మర్చిపోయారు. అందుకే ఎంత బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకైనా సరే టీఆర్పీలు రావడం బాగా కష్టమైంది. గతేడాది వీర సింహా రెడ్డి, బలగం లాంటి సినిమాలు తప్ప మిగిలిన వాటికేమీ మంచి టీఆర్పీలు రాలేదు. వాల్తేరు వీరయ్య కూడా టీఆర్పీల పరంగా అద్భుతాలు చేయలేకపోయింది.
తాజాగా భగవంత్ కేసరి టీవీలో ప్రసారం కాగా ఈ సినిమాకు ఏకంగా అర్బన్ నుంచి 9.36 రేటింగ్ వచ్చింది. స్కంద సినిమాకు 8.47 టీఆర్పీలు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి హిట్ అయితే, స్కంద ఫ్లాపుగా నిలిచింది. బాలయ్యకు ఇళ్లలో ఉన్న ఫాలోయింగ్, గతేడాది వీరసింహా రెడ్డి, అఖండలకు మంచి రెస్పాన్స్ రావడం, భగవంత్ కేసరిలో శ్రీలీల సెంటిమెంట్ ఉండటం వల్ల ఈ సినిమాకు మంచి వ్యూయర్షిప్ దక్కింది.
ఇక స్కంద సినిమా రిలీజ్ టైమ్ లో ట్రోలింగ్ కు గురవడం వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లలేదు. దీంతో ఆ ఆడియన్స్ మొత్తం ఇప్పుడు టీవీ లో వచ్చినప్పుడు స్కంద సినిమా చూశారు. బోయపాటి నుంచి వచ్చిన వినయ విధేయ రామకు కూడా గతంలో ఇంతే జరిగింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఆ సినిమా కూడా ఛానల్ లో ఎన్నిసార్లు వచ్చినా మంచి రేటింగ్స్ తో భారీ ఆదాయాన్ని అందుకుంది. ఏదేమైనా ఈ రేటింగ్స్ నిర్మాలకు ఆనందాన్నిచ్చే విషయాలే.













