అన్ని పాత్రలూ చేస్తా…వాళ్లిద్దరంటే నాకు చాలా ఇష్టం
ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడటాన్ని తగ్గించాలి. బేవర్స్లో నా పాత్ర కూడా ఈ విషయాన్నే చెబుతుంది అని అన్నారు నాయిక హర్షిత. ఆమె కథానాయికగా నటించిన చిత్రం బేవర్స్ ఈ నెల 12న విడుదల కానుంది. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించారు. నాయిక హర్షిత మీడియాతో మాట్లాడుతూ మాది జైపూర్. తెలుగులో బేవర్స్ నాకు నాలుగో చిత్రం. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. తమ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మెలిగేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. నటిగా అన్ని రకాల పాత్రల్లోనూ నటించాలనుకుంటాను. ఇందులో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని చెప్పే పాత్ర చేశాను. దర్శకుడు రమేశ్ చెప్పాల కష్టపడి తెరకెక్కించారు. నాకు వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్, రవితేజ సినిమాలంటే ఇష్టం. వాళ్లతో కలిసి నటించే అవకశావం వస్తే చాలా సంతోషిస్తాను అని అన్నారు.













