BSS11: ప్రీ లుక్ పోస్టర్ తోనే ఎట్రాక్ట్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) చేతిలో ఇప్పుడు పలు సినిమాలున్నాయి. ప్రస్తుతం భైరవం(Bhairavam), టైసన్ నాయుడు(Tyson Naidu)తో పాటూ కౌశిక్ పగళ్లపాటి(Koushik Pagallapati) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు శ్రీనివాస్. అందులో భైరవం, టైసన్ నాయుడు సినిమాల షూటింగ్ దాదాపు పూర్తైంది. అయితే ఇప్పుడు తాజాగా కౌశిక పగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి రమేష్ వర్మ(ramesh varma) దర్శకత్వంలో రాక్షసుడు(rakshasudu) అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. 2019లో సైకో కిల్లర్ ను వెంటాడిన ఈ జంట ఇప్పుడు 2025లో ఓ హార్రర్ మిస్టరీలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
#BSS11గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టు తెలుపుతూ ఓ ప్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రీ లుక్ పోస్టర్ లో సువర్ణమాయ అనే ఓ రేడియో ఆఫీస్ ముందు ఓ వ్యాన్ తగలబడిపోతూ కనిపించింది. ప్రీ లుక్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కనబరిచిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాను సాహు గారపాటి(Sahu Garapati) షైన్ స్క్రీన్స్(shine screens) బ్యానర్ లో రూపొందిస్తున్నాడు.






