Bellamkonda Sai Sreenivas: ఆ వైబ్రేషన్స్ చాలా సార్లు ఫేస్ చేశా
బాలీవుడ్ లో మంచి హీరోగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నంతో ఛత్రపతి(Chatrapathi) బాలీవుడ్ రీమేక్ పేరుతో కెరీర్లోని మూడేళ్ల ప్రైమ్ టైమ్ ను వేస్ట్ చేసుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(bellamkonda sai sreenivas). రీసెంట్ గా భైరవం(bhairavam) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీనివాస్ ఆ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం కిష్కింధపురి(kishkindhapuri) సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు శ్రీనివాస్.
కౌశిక్ పెగిళ్లపూడి(kaushik pegillapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(anuprama parameswaran) హీరోయిన్ గా నటిస్తుండగా సెప్టెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీనివాస్ చాలా యాక్టివ్ గా పాల్గొంటుండగా ఈ సినిమా చేసేటప్పుడు ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఫేస్ చేశారా అనే ప్రశ్నకు అతను సమాధానమిచ్చాడు.
చాలా సార్లు తనకు నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయని, నైట్స్ లో షూట్ చేయడంతో పాటూ మార్చురీల్లో ఎక్కువ సేపు ఉండటం, 75 రోజుల పాటూ హార్రర్ సెట్ లోనే షూటింగ్ జరిగిందని, ఇలాంటి సెట్స్ లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఎనర్జీస్ మొత్తం డౌన్ అవుతాయని, అయినా అవన్నీ యాక్టర్ లైఫ్ లో భాగమే అనుకుని ముందుకెళ్లానని, సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ తమ కష్టాన్ని గుర్తిస్తే చాలన్నాడు శ్రీనివాస్.







