బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభం
రైడ్’, ‘వీర’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హవీష్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత హవీష్ కొనేరు మాట్లాడుతూ ‘తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన తన లుక్‌ని మార్చుకున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను తెలియజేస్తాం’ అని చెప్పారు.













