జర్నలిజం మెయిన్ పాయింట్ గా ఓ చిత్రాన్నినిర్మించాలని ప్లాన్ చేస్తున్నాను : నిర్మాత బెక్కం వేణుగోపాల్
ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ రేపు ఏప్రిల్ 27న పుట్టినరోజు సందర్భంగా సినీ పాత్రికేయులతో జరిపిన చిట్ చాట్ “అందరకి నమస్కారం ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, సోషల్ మీడియా మిత్రుల కి అందరికి నమస్కారం, నా పుట్టినరోజు సందర్బంగా మీతో కలిసి మాట్లాడటం అనేది ఆనవాయితీ అది కొనసాగుతూనే వుంది, లక్కీ మీడియా స్థాపించి నిర్మాత గా ఇది నా పదహారో సంవత్సరం, ప్రముఖ 2006 అక్టోబర్ 12న నా మొదటి సినిమా టాటా బిర్లా మధ్యలో లైలా రిలీజ్ అయింది, ఈ పదహారు సంవత్సరాలు జర్నీలో నా మొదటి సినిమా ఎంకరేజ్ మెంట్ తో ప్రతి ఇయర్ సినిమా లు తీస్తూ ప్రొడ్యూసర్ గా ఎన్ని ఇబ్బందులు వున్నా పరిశ్రమలో కొనసాగటం గ్రేట్ అని అందరు చెప్తున్నారు, నేను ఇండస్ట్రీ లో ఈ స్థాయిలో ఉన్నానంటే మేజర్ గా నా ఫ్యామిలీ సపోర్ట్ మరియు నా ఫ్రెండ్స్ సపోర్ట్ తో ఈ జర్నీ కొనసాగుతుంది, పాండమిక్ టైం లో కూడా పాగల్ అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది, మీ అందరి సపోర్ట్ తో నెక్స్ట్ బర్త్ డే కల్లా మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను.
ప్రొడక్షన్ మేనేజర్ గా వచ్చి ప్రొడ్యూసర్ అవ్వటం జరిగింది, హీరో శివాజీ గారు మేము ఫ్రెండ్స్ ఆయన వల్ల నే టాటా బిర్లా సినిమా ఇచ్చారు, ఆర్టిస్టులు ఎంపిక, సినిమా బిజినెస్ అన్నిటిలో అనుభవం ఉంటేనే అతను పర్ఫెక్ట్ నిర్మాత అవుతాడు, నాకు మీడియా మీద చాలా గొప్ప గౌరవం వుంది, ఈ నేపధ్యం లోనే జర్నలిజం పై ఓ చిత్రాన్ని నిర్మించాలని అద్భుతమైన సబ్జెక్టు రెడీ చేసుకున్నాను మీడియా లో వుండే సాధకబాధకాలు కూలంకషంగా తెలిసిన వాడిని, నేను మొదట జాబ్ చేసింది జెమినీ టీవీ లోనే, కనుక పర్ఫెక్ట్ సబ్జెక్టు తో ఓ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాను.
ఇప్పటివరకు నేను వినోదాత్మక చిత్రాలను నిర్మించాను. ఇప్పుడు విష్ణు హీరోగా ఓ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ‘అల్లూరి’ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది. జూన్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాము. అదే విధంగా బూట్ కట్ బాలరాజు అనే సినిమా కూడా ప్రొడక్షన్ లో వుంది, ముందు ముందు కొన్ని సినిమాలు కథలు ఓకే చేసి ప్రీ ప్రొడక్షన్ లో వున్నాయి, థ్రిల్లింగ్ సబ్జక్ట్స్ వున్నాయి వాటి వివరాలు తరువాత చెప్తాను, డైరెక్షన్ అనేది ఓ డెడికేటెడ్ జాబ్, రకరాకాలుగా టెన్షన్ కి గురి అయ్యే ప్రొడ్యూసర్ కి క్రియేటివ్ గా అలోచించలేడు ఎవరు చేయాల్సిన పని వారు చెయ్యాలి. అందుకే నేను డైరెక్షన్ అనేది ఎప్పటికి చేయను.”అన్నారు.













