‘బ్యూటీపుల్’ ట్రైలర్ విడుదల
సూరి, నైనా జంటగా నటించిన చిత్రం బ్యూటిపుల్. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉపశీర్షిక. అగస్త్య మంజు దర్శకుడు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్‌పై టి.నరేష్కుమార్, శ్రీధర్ లతో కలిసి రాంగోపాల్ వర్మ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. రాంగోపాల్ వర్మతో కలిసి లక్ష్మీతో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన అగస్త్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన వర్మ స్టైల్లోనే ఈ సినిమా తీశారు. వర్మ చిత్రాల్లో రంగీలా కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ట్రిబ్యూల్ టూ రంగీలా అని చెప్పడానికి కారణం ఏంటో సినిమా చూశాక అర్థం అవుతుందని నిర్మాతలు తెలిపారు. సంగీతం: రశిశంకర్.













