Artist Movie: “ఆర్టిస్ట్” సినిమా నుంచి బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘ఓ ప్రేమ ప్రేమ…’ రిలీజ్
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “ఆర్టిస్ట్”(Artiste). ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. “ఆర్టిస్ట్” మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
‘ఓ ప్రేమ ప్రేమ..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా.. రాంబాబు గోసాల మంచి లిరిక్స్ అందించారు. రమ్య బెహర ఆకట్టుకునేలా పాడారు. ‘ఓ ప్రేమ ప్రేమ..’ పాట ఎలా ఉందో చూస్తే… జారే కన్నీరే అడుగుతుందా ..నేరం ఏముందో చెప్పమంటూ.. నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా ..నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా..అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట.
ఒక వినూత్నమైన ప్రేమ కథతో “ఆర్టిస్ట్” సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన చూస్తూ చూస్తూ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.













