ముందుగానే మాకు దీపావళి వచ్చింది
ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌత్ టాక్‌తో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న చిత్రం బంగారి బాలరాజు. ఈ సందర్భంగా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లో సినిమా కార్యాలయంలో నిర్వహించింది. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి బాణసంచా కాల్చి సంబరం చేసుకుంది యూనిట్. రాయలసీమ పరువు హత్యల నేపథ్యంలో యదార్థ ప్రేమకథతో వచ్చిన ఈ చిత్రం విజయోత్సవంగా మీడియాతో మాట్లాడారు.. దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ బంగారి బాలరాజు విజయానికి కారకులైన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అన్నారు. తాను దర్శకుడిగా సక్సెస్ అవ్వటానికి కారణమైన ప్రొడ్యూసర్లకు యూనిట్‌కు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ముందుగానే మాకు దీపావళి వచ్చింది అన్నారు. హీరో రాఘవ్ మాట్లాడుతూ యూనిట్‌కు ముందుగానే దీపావళి వచ్చిందని అన్నారు.













