Bandla Ganesh: సెన్సేషనల్ కామెంట్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసిన బండ్ల గణేష్(bandla ganesh) తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించాడు. ఆంజనేయులు(Anjenuyulu), ఇద్దరమ్మాయిలతో(Iddarammayilatho), గబ్బర్ సింగ్(Gabbar Singh), టెంపర్(Temple) లాంటి సూపర్ హిట్లను అందుకుని టాలవుడ్ లో టాప్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ కొంతకాలంగా తన బ్యానర్ లో సినిమాలను తీయడం మానేశాడు.
సినిమాలను తీయడం మానేసినప్పటికీ బండ్ల గణేష్ ఎప్పుడూ ఇండస్ట్రీకి దూరంగా లేడు. ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగినా, ఎవరు అతన్ని పిలిచినా ఆ కార్యక్రమానికి హాజరై, తన రేంజులో స్పీచులిచ్చి ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తూ ఉంటాడు. మైకు చేతిలోకి వచ్చిందంటే బండ్ల గణేష్ ను ఆపడం ఎవరి తరం కాదు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ రీసెంట్ గా కె ర్యాంప్ సక్సెస్ మీట్(K Ramp Success meet) లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
బండ్ల కామెంట్స్ ఓ యంగ్ హీరోని టార్గెట్ చేసినట్టు ఉన్నాయని ప్రచారం జరిగింది. దీంతో తన కామెంట్స్ పై రియాక్ట్ అయి క్లారిటీ ఇచ్చాడు బండ్ల గణేష్. రీసెంట్ గా కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో తాను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసిందని, తాను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, తన ఉద్దేశం అందరూ బాగుండాలని, కళామాత ఆశీస్సులతో అందరూ పైకి రావాలని మాత్రమేనని ఎక్స్ లో పోస్ట్ చేయడంతో మరోసారి ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://x.com/ganeshbandla/status/1986012358557446562







