Teenmar: తీన్మార్ రీరిలీజ్‌పై బండ్ల గణేష్ ఏమన్నాడంటే..
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అన్ని సినిమాలనూ రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి సినిమాలను ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసి నిర్మాతలు కూడా బాగానే లాభ పడుతున్నారు. రిలీజ్ టైమ్ లో ఫ్లాపైన సినిమాలు సైతం ఇప్పుడు మంచి కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి.
ఐతే, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ కు తీన్మార్(Teenmar) సినిమా ఎంతో స్పెషల్ అనేది స్పెషల్ గా చెప్పే పన్లేదు. పవన్ ఆ సినిమాలోని పాటలకు, డైలాగ్స్ కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ మూవీ లవ్ ఆజ్ కల్(Aajkal)కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రీరిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే పవన్(Pawan) ఫ్యాన్స్ లోని ఓ ఫ్యాన్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేస్తూ లైవ్ డబ్బింగ్ ఎందుకు చెప్పారు? అసలు థియేటర్లో డైలాగులే వినిపించలేదని అన్నాడు. దీంతో ఈ విషయంపై తీన్మార్ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) రెస్పాండ్ అయ్యాడు. కొత్తగా డబ్బింగ్ చెప్పించి, మిక్సింగ్ చేసి మళ్లీ సినిమాను రిలీజ్ చేస్తానని బండ్ల గణేష్ రిప్లై ఇవ్వడంతో త్వరలోనే తీన్మార్ రీరిలీజ్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.













