సాయి ధరమ్ తేజ్ తో బండ్ల గణేష్ చిత్రం!
పవన్ కళ్యాణ్, జూ. ఎన్టీర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవి తేజ, వంటి టాప్ హీరోలతో సినిమాలు చేసి, వున్నట్లుండి రాజకీయాలలోకి వెళ్లిపోయాడు బడా నిర్మాత బండ గణేష్. అలాంటిది ఇటీవల వున్నట్లుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సెల్ఫీ దిగి నా దేవుడు అనుమతిచ్చాడు అంటూ ట్విట్టడు. చెప్పకనే చెప్పినట్టు వివరించీ వివరించకుండా పవర్ స్టార్ తో సినిమా అనే ఫ్లేవర్ ని బయటకు వదిలాడు. కానీ ఆ సినిమా సంగతేమో కానీ, మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో మాత్రం ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎమర్జెన్సీ కోట మాత్రం కాదు. సాయి ప్రస్తుతం చేస్తున్న దేవా కట్టా, దిల్ రాజు సినిమాలు పూర్తయిన తరువాత ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల బండ్ల గణేష్ ఓ షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ ను కలిసి మాట తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ తన మిత్రుడు దేవా కట్టా చేస్తున్న షూట్ కు వెళ్లి అక్కడ సాయి తేజ్ ను కలిసినట్లు బోగట్టా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు సినిమాలు తరువాత అయినా తనకు ఓ సినిమా చేయాలని కోరినట్లు, దానికి తేజ్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.













