Bandla Ganesh: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తేజ సజ్జ మరో అల్లు అర్జున్

స్పీచ్ లందు బండ్ల గణేష్ స్పీచ్ వేరయ్యా అన్నట్టుంటుంది టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(bandla ganesh) మాట్లాడితే. ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడటం మొదలుపెడితే ఆయన ఎలివేషన్లకు ఎవరైనా సరే ఫిదా అవాల్సిందే. ఎదురు ఎంత పెద్ద స్టార్లున్నా సరే ఎలాంటి మొహమాటం లేకుండా మనసులో అనిపించింది బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు గణేష్.
ఇక అసలు విషయానికొస్తే, టాలీవుడ్ ప్రముఖుల కోసం బండ్ల గణేష్ హైదరాబాద్ లోని తన ఇంట్లో దీపావళిని పురస్కరించుకుని ఓ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), వెంకటేష్(venkatesh), శ్రీకాంత్(srikanth), సిద్ధు జొన్నలగడ్డ(siddhu Jonnalagadda), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(bellamkonda Sai sreenivas), తేజ సజ్జ(teja sajja) లాంటి నటులు హాజరవగా, తేజ సజ్జాను పార్టీకి ఆహ్వానిస్తూ ఫోటోలకు పోజులిచ్చే క్రమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
భారతీయ సినీ ఇండస్ట్రీలో మరో అల్లు అర్జున్(allu arjun) కాకపోతే నన్ను అడగండి అంటూ తేజ సజ్జను దగ్గరకు తీసుకుంటూ అన్నారు బండ్ల గణేష్. ఆయన ఈ కామెంట్స్ చేయగానే అక్కడ అందరూ ఒక్కసారిగా చప్పట్లు, హర్షధ్వానాలతో సందడి చేశారు. కాగా తేజ రీసెంట్ గానే మిరాయ్(mirai) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని, జాంబిరెడ్డి2(jombie reddy2) కోసం రెడీ అవుతున్నాడు.
https://x.com/idlebrainjeevi/