Balayya Vs Pawan: అఖండ2కు పోటీగా ఓజీ?

టాలీవుడ్ లో సినిమా రిలీజ్ కు డేట్స్ చాలా పెద్ద సమస్యగా మారాయి. తెలుగు సినిమా స్థాయి పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు చేస్తున్నారు. బడ్జెట్ ఎక్కువ పెట్టడంతో నిర్మాతలు సోలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎంతో ముందుగానే సినిమా రిలీజ్ డేట్స్ ను లాక్ చేసుకుని పెట్టుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan), బాలకృష్ణ(Balakrishna) సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి రానున్నాయనే వార్తలు అభిమానుల్లో చర్చలకు దారి తీస్తున్నాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను(Boyapati Srinu) తో కలిసి అఖండ2(Akhanda2) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ సినిమాను అనౌన్స్ చేసిన రోజే వెల్లడించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్, సుజీత్(Sujeeth) దర్శకత్వంలో చేస్తున్న ఓజీ(OG) సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఓజీ ను సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని బయ్యర్లతో నిర్మాత దానయ్య అన్నారట. దీంతో బాలయ్య, పవన్ సినిమాల మధ్య క్లాష్ జరుగుతుందేమోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే పవన్, బాలయ్య మధ్య ఇప్పుడు చాలా మంచి బాండింగ్ ఉంది కాబట్టి సినిమాలను అనవసరంగా క్లాష్ చేసుకుని కలెక్షన్స్ ను షేర్ చేసుకోకుండా ఇద్దరూ ఈ విషయంలో చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశముంది.