Balayya vs Chiru: బాలయ్యతో చిరూ క్లాష్?

ఈ మధ్య ఇండస్ట్రీలో రిలీజ్ డేట్ల సమస్య చాలా పెద్దదిగా మారిపోయింది. ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒకప్పటిలా లేవు. అందుకే భారీ సినిమాలకు సోలో రిలీజ్ లు దక్కకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఈ ఇయర్ సెప్టెంబర్ 25ను అందరి కంటే ముందుగా లాక్ చేసుకుంది బాలయ్య(Balayya) అఖండ2(akhanda2) సినిమానే. కానీ తర్వాత అదే స్లాట్ లోకి పవన్ కళ్యాణ్(pawan kalyan) ఓజి(OG) కూడా వచ్చి చేరింది.
అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ఒకవేళ ఓజి సినిమా సెప్టెంబర్ 25 నుంచి తప్పుకుంటే ఆ స్లాట్ ను వాడుకోవాలని చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(viswambhara) చూస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వంభరను సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఇంకా ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి డెసిషన్ ను తీసుకోలేదు.
ఒకవేళ పవన్ సినిమా ఏ కారణంతో అయినా వాయిదా పడితేనే విశ్వంభర వస్తుంది తప్పించి లేదంటే మరో డేట్ ను వెతుక్కుంటుంది. ఇప్పటికైతే ఓజి వాయిదాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. మేకర్స్ అనుకున్న టైమ్‌కే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఏదైనా ఇబ్బందుల వల్ల ఓజి తప్పుకుంటే మరోసారి బాలయ్య, చిరూ మధ్య క్లాష్ తప్పదు.