పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య ?
ఎన్టీఆర్ బయోపిక్ తరువాత నందమూరి బాలకృష్ణ ఎన్నికల కోసం సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కాంబోలో జైసింహా చిత్రం తెరకెక్కింది. ఇక కొత్త ప్రాజెక్టుకు సంబంధించి బాలయ్య పాత్రపై ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సినిమాలో బాలకృష్ణ ఒక పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడట. రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీనరసింహా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాడు. ఇప్పుడు గ్యాప్ తరువాత బాలయ్య మళ్లీ పోలీస్ యూనిఫాం పాత్రలో కనిపించటం అభిమానులకు వినోదమే. గ్రామీణ నేపథ్యంలో కత తెరకెక్కతుందని అంటున్నారు. సినిమాకు రౌడీ పోలీస్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం బాలయ్య సరసన ఒక హీరోయిన్గా హరిప్రియకు అవకావం దక్కింది. జైసింహా లో బాలయ్యతో హరిప్రియ ఆడిపాడటం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయుక్తం కాలేదు.ఈ ప్రాజెక్టుతోనైనా హరిప్రియకు మరిన్ని అవకాశాలు దక్కుతాయేమో చూడాలి. త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్దం చేస్తోందని సమాచారం.













