హైదరాబాద్‌లో బాలయ్య సందడి
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా హ్యాపీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. సోనాల్ చౌహాన్, వేదిక నాయికలు. ఇటీవల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్‌ని పూరి చేసుకుంది. ఈ నెల 5 నుంచి రామోజీ ఫిలింసిటీలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రధాన పాత్రధారులంతా చిత్రీకరణలో పాలుపంచుకోబోతున్నారు. బాలయ్య లుక్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. ఆయన రెండో గెటప్ కూడా అభిమానులకు నచ్చుతుంది. ప్రకాష్‌రాజ్, జయసుధ, భూమిక పాత్రలూ ఆకట్టుకుంటాయని చిత్రబృందం తెలిపింది. షాయాజీ షిండే, నాగినీడు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.













