Balakrishna: పోటీకి సై అంటున్న బాలయ్య
టాలీవుడ్ లో సెప్టెంబర్ 25న రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి అఖండ2 తాండవం(akhanda2 thandavam) కాగా రెండోది ఓజి(OG). ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో భారీ క్రేజ్ నెలకొంది. అయితే ఈ రెండింటిలో ఓజి సినిమా రేసులో కాస్త ముందుగా ఉండటంతో అఖండ2 వెనుకబడింది. దీంతో అఖండ2 వాయిదా పడటం ఖాయమని వార్తలొస్తున్నాయి.
అయితే ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే అఖండ2 ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఓజి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేసుకుంటే అఖండ2 తాండవం మాత్రం ఇంకా అక్కడివరకు రాలేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గానే అఖండ2కు బాలయ్య(balayya) తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేశారు.
దీన్ని బట్టి చూస్తుంటే బాలయ్య రిలీజ్ డేట్ ను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయాలనుకోవడం లేదని తెలుస్తోంది. అంటే పవన్ తో కలిసి పోటీ పడటానికి బాలయ్య రెడీ అవుతున్నట్టే. బోయపాటి శ్రీను(Boyapati srinu) దర్శకత్వంలో వస్తోన్న అఖండ2 తాండవంపై అందరికీ భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను అఖండ2 ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.







