పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అవుతున్న బాలయ్య
ప్రస్తుతం చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకు అందరూ పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే ఉద్దేశంతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అయితే స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
సీనియర్ హీరోల్లో కూడా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ మేరకు ప్రయత్నం చేశారు. ఇక ఈ లిస్ట్ లో జాయిన్ అవడానికి బ్యాలెన్స్ ఉంది నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఇప్పటివరకు బాలయ్య పాన్ ఇండియా సినిమా చేయలేదు. కేవలం రీజనల్ మార్కెట్ పైనే దృష్టి పెట్టి సినిమాలు చేస్తున్న బాలయ్య, త్వరలోనే పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ, బాలయ్య తో ఆదిత్య 369 లాంటి ఓ సినిమాను చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. బాలయ్యను ఎలా ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ కు నచ్చుతుందో కూడా తనకు ఓ ఐడియా ఉందని చెప్పాడు. బాలయ్య కూడా ప్రశాంత్ తో సినిమా చేస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడందరూ బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ప్రశాంత్ వర్మతోనే ఉంటుందని అంటున్నారు.













