రీమేక్ కు నో చెప్పిన బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ రీమేక్ సినిమాలో నటించేందుకు నిరాకరించారా? ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్వతహాగా రీమేక్ సినిమాల్లో నటించేందుకు బాలకృష్ణ ఆసక్తి చూపించరు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అంగీకరిస్తుంటారు. మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోశియమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, అందులో బాలకృష్ణ రానా నటిస్తారని కొద్ది రోజులుగా వినిపిస్తోంది. నిర్మాతలు సైతం వీరిని సంప్రదించినట్టు సమాచారం. అయితే తాజాగా విషయం ఏమంటే బాలకృష్ణ నటించేందుకు ఆసక్తి చూపలేదట. ఇప్పటికే కమిటైన సినిమాలు ఉన్న కారణంగా కొత్తవి అంగీకరించడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. దాంతో బాలకృష్ణకు బదులుగా మరో సీనియర్ హీరో చేత ఆ పాత్ర చేయించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.













