Akhanda2: అఖండ3 కు ప్లాన్ చేస్తున్న బాలయ్య- బోయపాటి

బాలకృష్ణ(balakrishna)- బోయపాటి శ్రీను(boyapati srinu) కాంబినేషన్ లో వచ్చిన అఖండ(akhanda) సినిమా ఎంత భారీ సక్సెస్ ను అందుకుందో తెలిసిందే. హిట్ టాక్ తో పాటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అఖండకు సీక్వెల్ గా ఇప్పుడు అఖండ2(akhanda2) తెరకెక్కుతుంది. అఖండ సీక్వెల్ గా వస్తున్న సినిమా అవడం, దానికి తోడు బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా అవడంతో అఖండ2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలను మరింత పెంచుతూ రీసెంట్ గా వచ్చిన అఖండ2 కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తర్వాత ఎప్పుడెప్పుడు అఖండ2 సినిమాను థియేటర్లలో చూస్తామా అని అటు బాలయ్య, నందమూరి ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
అఖండ2 క్లైమాక్స్ లో అఖండ3(akhanda3) కు సంబంధించిన లీడ్ ఉంటుందని దాని కోసం డైరెక్టర్ బోయపాటి ఓ చిన్న ఎపిసోడ్ ను కూడా ప్లాన్ చేశాడని, బోయపాటి శ్రీను- బాలయ్య ఇద్దరికీ అఖండ ఫ్రాంచైజ్ ను ఇక్కడితో ముగించడం ఇష్టం లేదని, ఆ ఫ్రాంచైజ్ ను ముందుకు తీసుకెళ్లాలనే ఆసక్తితో మూడో భాగం కోసం అఖండ2 క్లైమాక్స్ లో లీడ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. అదే నిజమైతే అఖండ2పై ఇప్పుడున్న హైప్ ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.