యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న మోక్షజ్ఞ
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 2018లో మోక్షజ్ఞ డెబ్యూ గురించి చర్చలు మొదలయ్యాయి. అవి ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి తప్పించి మోక్షు ఎంట్రీ ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు. బాలకృష్ణ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడని కూడా వార్తలొచ్చాయి.
కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ బయటకు రాలేదు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వైజాగ్లో యాక్టింగ్ గురు సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. గతంలో సత్యానంద్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి ఎంతోమంది అగ్ర నటులకు ట్రైనింగ్ ఇచ్చారు.
ఇప్పుడు మోక్షజ్ఞ కూడా ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. యాక్టింగ్ తో పాటూ, బాడీ మేకోవర్ పై కూడా మోక్షజ్ఞ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మోక్షజ్ఞ లుక్స్ లో ఈ మధ్య చాలా తేడాలొచ్చి, స్లిమ్ గా కనిపిస్తున్నాడని సమాచారం. మొత్తానికి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ తనను తాను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.













