Tejaswini: తేజస్విని యాడ్ లో నటించడానికి గల అసలు కారణమిదే
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం అఖండ2(akhanda2) రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు తేజస్విని నందమూరి(tejaswini nandamuri) సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, బాలయ్య(balayya) కొడుకు మోక్షజ్ఞ(mokshagna) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సినిమాకు తేజస్వినినే నిర్మాతగా వ్యవహరిస్తోంది.
కొన్నాళ్లుగా బాలయ్య సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను ఆరా తీస్తూ, అన్నీ తెలుసుకుంటున్న తేజస్విని ఎప్పుడూ ఆన్ స్క్రీన్ పై కనిపించడం కానీ, కెమెరా ముందుకొచ్చి నటించడం కానీ చేసింది లేదు. అలాంటి తేజస్విని తాజాగా ఓ జ్యుయలరీ యాడ్ లో కనిపించడమే కాకుండా దానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.
తాజాగా ఆ జ్యుయలరీ యాడ్ రిలీజవడంతో దాన్ని చూసిన అందరూ తేజస్విని ఆన్ స్క్రీన్ బావుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తేజస్విని ఆ యాడ్ చేయడానికి కారణం తన ఫ్యామిలీనే అని తెలుస్తోంది. ఆమె నటించిన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్(Siddhartha fine jewelleres) యాడ్ లో సిద్ధార్థ అంటే మరెవరో కాదట. తేజస్విని భర్త భరత్(Bharath) కు సొంత తమ్ముడే సిద్ధార్థ అంట. తన మరిది జ్యుయలరీ కంపెనీ కోసమేతేజస్విని ఆ యాడ్ చేసిందని, మామూలుగా అయితే తేజూ చాలా ప్రైవేట్ పర్సన్ అని, ఎప్పుడూ బయటకు రాకుండా చాలా రిజర్డ్వ్ గా ఉంటుందని, మొదటిసారి డేర్ చేసి ఈ యాడ్ చేసిందని, యాడ్ షూట్ మొత్తం ఒక్క రోజులోనే పూర్తైందని, సింగిల్ టేక్ లోనే అన్ని షాట్స్ చేసేసిందని, తన తండ్రికి తేజస్విని నిజమైన వారసురాలని, తేజస్విని కోడలుగా రావడం తమ అదృష్టమని తేజస్విని అత్త శ్రీమణి(Srimani) తెలిపారు.
https://www.instagram.com/reel/DQdfSszE4L4/?utm_source=ig_web_copy_link







