పారా విజేతలకు బాలయ్య అభినందనలు
పారాలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క భారత క్రీడాకారులకు, విజేతలకు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. అంగవైకల్యాన్ని అధిగమించి తమ ప్రతిభ పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో పతకాలను గెలవటమే కాకుండా కొత్త రికార్డస్ స్పష్టించారు. మీరు కేవలం క్రీడాకారులే కాదు, అంగవైకల్యాన్ని శాపంగా భావించి బాధపడే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఆశాజ్యోతులు, ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బాలకృష్ణ అభినందనలు తెలియజేశారు.













