Balakrishna: అఖండ2 తర్వాత ఎవరితో అంటే
బ్యాక్ టు బ్యాక్ నాలుగు విజయాలు అందుకున్న బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ స్పీడు చూపిస్తున్న బాలయ్య ఇప్పుడు బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా అఖండ2(Akhanda2) చేస్తున్నాడు. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న అఖండ2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే అఖండ2 తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడనే విషయంలో అందరికీ ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో దాని గురించి ఓ అప్డేట్ బయటికొచ్చింది. అఖండ2 తర్వాత బాలయ్య తన తర్వాతి సినిమాను గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో చేయనున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అఖండ2 తర్వాత బాలయ్య(Balayya) చేయబోయే సినిమా తనతోనే అని, ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కషన్స్ అయిపోయాయని, ఈసారి బాలయ్య కోసం తాను సాలిడ్ కథను సిద్ధం చేశానని, అందరి అంచనాలను మించి సినిమా ఉండబోతుందని, జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుందని, ఈ మూవీలో బాలయ్య లుక్ వీరసింహా రెడ్డి(Veera Simhareddy) లుక్ ను మించేలా డిజైన్ చేస్తున్నట్టు గోపీచంద్ వెల్లడించాడు.






