బాలయ్య, సుక్కూ వర్కవుట్ అవుతుందా?
వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టి మంచి జోష్ లో ఉన్న బాలకృష్ణ తన 109వ సినిమాను వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 110వ సినిమాను బోయపాటితో అఖండ2 చేయనున్నాడని ఇప్పటికే దాదాపు ఖాయమైంది. దాని తర్వాత 111వ సినిమాను వీర సింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో చేయనున్నాడట.
వాటి తర్వాత మరో సినిమాను బాలయ్య, సుకుమార్ తో చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుక్కూతో బాలయ్య సినిమా చేస్తే ఆ మజానే వేరు. ఈ కాంబో సెట్ అవుతుందా లేదా అన్నది తెలీదు కానీ ఈ ఊహ మాత్రం బాగుందని బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
సుకుమార్, బాలకృష్ణల స్టైల్ పూర్తిగా వేరు. మరి వీరిద్దరూ కలిసి ఎలాంటి కథతో సినిమా చేస్తారో? అని అందరూ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. పుష్ప2 తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది కానీ మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా ఉంటుందా ఉండదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ బాలయ్య, సుకుమార్ కాంబోలో సినిమా ఉన్నా సరే అది సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే టైమ్ పట్టనుంది.













