అనిల్ రావిపూడికి ఛాన్సిచ్చిన బాలయ్య
టాలీవుడ్ లో వంద శాతం సక్సెస్ తో దూసుకెళ్తూ స్టార్ డైరక్టర్ల లిస్ట్ లోకి జాయిన్ అయిపోయాడు అనిల్ రావిపూడి. ఎప్పటి నుంచో అనిల్.. బాలయ్యతో సినిమాలు చేయాలని చూస్తున్నప్పటికీ అది ఇప్పటి వరకు కుదరలేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వూలో అనిల్ ప్రస్తావిస్తూ, ఇప్పటికే బాలయ్యకు ఒక స్టోరీ లైన్ చెప్పానని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే లేట్ అని చెప్పుకొచ్చాడు. సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, బాలయ్య కూడా ఈ కథతో సినిమా చేయడానికి సమ్మతంగానే ఉన్నట్లు చెప్తున్నారు.
బాలయ్య కోసం అనిల్ ఒక పవర్ ఫుల్ కథను రెడీ చేశారని, దానికి బాలయ్య ఒప్పుకోవడంతో వచ్చే యేడాది అంటే ఎఫ్3 తర్వాత ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే యోచనలో అనిల్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందనుందని చెప్తున్నారు. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత అనిల్ తో సినిమాలుండే ఛాన్సులున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అనిల్ ఎఫ్3 సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించిన షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. కోవిడ్ తో క్వారంటైన్ లో ఉన్న డైరక్టర్, వచ్చే నెలలో ఒక లాంగ్ షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేసుకున్నాడు. వాస్తవానికి బాలయ్య తో పాటు మహేష్, రామ్ పోతినేని లతో సినిమాలు చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నాడు అనిల్. కానీ మహేష్ సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడనే వార్త బలంగా వినిపిస్తుంది. రామ్ లింగుస్వామి తో సినిమా కమిట్ అయ్యాడు. దీంతో అనిల్ బాలయ్యతోనే ముందుగా సినిమా చేసే ఛాన్సుందని అనిపిస్తుంది.













