Balakrishna: ప్రశాంత్ వర్మకు బ్రేక్…? కొడుకుతో మొదలెట్టేసిన బాలయ్య
నందమూరి వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు దాదాపుగా ఆరేళ్ళ నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. సినిమా ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో అని కొంతమంది, రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో అని కొంతమంది బోయపాటి డైరెక్షన్లోనే సినిమా చేస్తాడని మరికొంతమంది ఎవరికి నచ్చిన ప్రచారం వాళ్లు చేస్తూ వచ్చారు. చివరకు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా కన్ఫామ్ అయినా ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయింది అనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ… ప్రశాంత్ సినిమా విషయంలో పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 సినిమాను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎప్పుడో కథ రెడీ చేసి పెట్టుకున్న బాలకృష్ణ తన కొడుకుకు తగ్గట్టుగా మార్పులు కూడా చేశారు. ఇటీవల అన్ స్టాపబుల్ షోలో దీనికి సంబంధించిన లుక్ తో బాలకృష్ణ కూడా కనిపించారు. ఆ లుక్ బాగా వైరల్ అయింది.
బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ లో చేయబోయే పాత్ర అదే అంటూ నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా స్త్రీలీలను తీసుకునే అవకాశం ఉందని టాక్. దీనికి నిర్మాతగా కూడా బాలకృష్ణ స్వయంగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం అఖండ సీక్వెల్లో అలాగే డాకూ మహారాజ్ సినిమాకు పనిచేస్తున్న బాలకృష్ణ మరి ఈ సినిమాను ఏ రేంజ్ లో డైరెక్ట్ చేస్తారో చూడాలి. ఎప్పటినుంచొ డైరెక్షన్ చేయాలని కలలు కంటున్న బాలకృష్ణ ఈ సినిమాతో తన కల నెరవేర్చుకునే అవకాశం స్పష్టంగా కనబడుతోంది.













