హరీష శంకర్ దర్శకత్వంలో బాలయ్య?
ఈ మధ్య టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లందరూ నందమూరి బాలకృష్ణ వెంట పడుతున్నారు. అఖండ తర్వాత గోపీచంద్ మలినేని, బాలయ్యతో వీరసింహా రెడ్డి సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్యతో రీసెంట్ గా హను మాన్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఆయన కోసం ప్రశాంత్ వర్మ స్టోరీ కూడా రెడీ చేసి పెట్టినట్లు చెప్పాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్ కూడా జాయిన్ అయ్యాడు.
ఆయన మరెవరో కాదు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో అందర్నీ అలరించిన హరీష్ శంకర్. తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, బాలయ్య కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు.













