రూలర్ కు గుమ్మడికాయ కొట్టారు
రూలర్ చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటించారు. సి.కల్యాణ్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్టో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో పాటల లిరికల్ వీడియోను విడుదల చేస్తాం అని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సీవీ రావ్, పత్సా నాగరాజు సహ నిర్మాతలు.













