బాలయ్య భారీ పోరాటాలు
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం కోసం హోరాహోరీగా ఫైట్లు చేస్తున్నారు. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. ఫైట్ మాస్టర్లు అన్బు, అరవి ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల తొలి షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ రెండు వైవిధ్యమైన గెటప్పుల్లో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన లుక్‌కి, పోస్టర్లకు మంచి స్పందన వస్తోందని సి.కల్యాణ్ అన్నారు.













