Akhanda2: అఖండ2లో బాలయ్య పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్
వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ మీదున్న బాలకృష్ణ(Balakrishna) తాజాగా సంక్రాంతికి డాకు మహారాజ్(Daku Maharaj) మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. డాకు మహారాజ్ తర్వాత సినిమా కోసం బాలయ్య బోయపాటి శ్రీను(Boyapatri Srinu)తో మరోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ(Akhanda) సినిమాకు కొనసాగింపుగా అఖండ2(Akhanda2) తాండవం తెరకెక్కుతోంది.
ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అఖండ2 తాండవంపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టంట ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. అఖండ2లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రెండు పాత్రల్లో ఓ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు.
అఖండ2 ఇంటర్వెల్ లో బాలయ్య రెండో పాత్ర రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికి ఇదే హైలైట్ గా నిలుస్తోందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. బాలయ్య నెగిటివ్ రోల్ పై వస్తున్న ప్రచారం నిజమైతే మాత్రం అఖండ2లో బాలయ్య నట విశ్వరూపాన్ని చూడొచ్చు. అఖండకు సంగీతం అందించిన తమన్(Thaman) ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. అఖండ2 సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.













