జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ రెడీ!
టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరూ కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కొన్నాళ్లుగా తన రాజకీయ జీవితంలో బిజీ బిజీగా గడిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎట్టకేలకు అభిమానుల యొక్క కోరిక మేరకు వకీల్ సాబ్ ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో కనిపిస్తుండగా ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుని సినిమాపై వారిలో అంచనాలు పెంచింది.
ఇక దీనితో పాటు మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్ మూవీ కూడా చేస్తున్నారు పవన్. ఏ ఎమ్ రత్నం నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ పాత్ర పోషిస్తున్నట్లు టాక్. కాగా వీటిలో వకీల్ సాబ్ ముందుగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు బాలయ్య. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా భారీ విజయాలు అందుకోవడంతో దీనిపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి గత ఏడాది మొత్తంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య, వాటితో పరాజయాలు అందుకున్నారు.
అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాతో గట్టిగా హిట్ కొట్టాలని మంచి కసితో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇక అటు బాలయ్య, ఇటు పవన్ ఇద్దరినీ ఒక విషయమై పరిశీలిస్తే వీరిద్దరూ కూడా అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమా జీవితంలో కూడా దూసుకెళ్తున్నారు. తన జనసేన పార్టీ కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు పవన్ సినిమాలు కూడా చేస్తుండగా, ఎమ్యెల్యే గా తన హిందూపూర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చూసుకుంటూనే మరోవైపు బోయపాటి సినిమా చేస్తున్నారు బాలయ్య. మరి ఈ ఇద్దరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ఎంతవరకు విజయాలు అందుకుంటారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాలి…..!!
సినిమా విషయం ఆ విధంగా ఉండగా ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ తరపున ఎవరు ప్రచారం చేస్తారు ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ప్రచారం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రచారానికి సంబంధించి కొంత మందిని వాడుకునే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు.
అయితే నందమూరి కుటుంబాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేయించే విధంగా చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నందమూరి బాలకృష్ణ అదే విధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాదులో ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రచారం మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
మంచి రోజు చూసుకుని బాలకృష్ణ ప్రచారం మొదలు పెడతారని ఆ తర్వాత నారా లోకేష్ కూడా ప్రచారం మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఎక్కడైతే ఎక్కువగాఉంటారో అక్కడ ప్రచారం చేసే విధంగా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బాలకృష్ణ కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హైటెక్ సిటీ సహా కొన్ని ప్రాంతాల్లో ఐటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా పోటీ చేసే అవకాశం ఉంది. దీనితో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళుతుంది. మరి ప్రచారం ఎప్పుడు మొదలు పెడతారు ఏంటి అనే దానిపై స్పష్టత రానుంది.
దీంతోమరో పక్క అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ, జీహెచ్ఎంసీ పరిధిలో క్రియాశీలకంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయన్నారు. గ్రేటర్ ఎన్నికల పోటీలో 50 మంది సభ్యులను నిలపెట్టడానికి సన్నద్ధం అయ్యారు. ఇటు బాలయ్య అటు పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికలకు సినిమా గ్లామర్ ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.













